ధార్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
బాచేపల్లెలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ధార్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డ మండలం, బాచేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత ఐదు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం ఎస్సీ కాలనీలోని శ్రీ రామాలయం నందు ముగిశాయి. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, ప్రతి రోజు స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన, శనివారం భజన మరియు హరికథా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్లాల రఘునాథ శర్మ, అర్చకులు పుల్లయ్య శర్మ, సర్పంచ్ నాగేంద్ర, ఎం.పి.టి.సి. సభ్యులు ధర్మ ప్రచార మండలి సభ్యులు కశెట్టి నాగేశ్వరరావు, టి.వి.వీరాంజనేయ రావు, కశెట్టి నాగిరెడ్డి, రాటాల శ్రీనివాసులు, బద్రివరసయ్య పాములేటి, రాటాల లక్ష్మీ నారాయణ, పాప నరసింహారావు, భద్రి నరసింహుడు, తెలుగు లింగమయ్య, శీలం హరినాథ రెడ్డి, శీలం రామేశ్వర రెడ్డి, గొల్ల శ్రీరాములు, కల్లూరి తిరిపేలు, గుండా నరసింహయ్య , తోటంశెట్టి సుబ్రహ్మణ్యంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.