గ్రామాల ప్రశాంతతే మాకు ముఖ్యం:డీఎస్పీ
1 min readబ్రాహ్మణకొట్కూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గ్రామాల ప్రశాంతతే మాకు ముఖ్యమని ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్టుకూర్ పోలీస్ స్టేషన్ ను సోమవారం డీఎస్పీ తనిఖీ చేశారు.పల్లెల్లో అలజడులు గొడవలు చేస్తే ఎవ్వరి నైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు.సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలని ఎస్ఐ కి సూచించారు.స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ఏ చిన్న సంఘటన జరిగినా ఎవ్వరినీ ఉపేక్షించవద్దని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామాల ప్రశాంతతే మాకు ముఖ్యమని వాటికి విరుద్ధంగా ఎవ్వరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని అ న్నారు.స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.స్టేషన్ కు వచ్చే వారిని గౌరవించి సమస్యలపై ఎప్పటి కప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఎస్ఐకి సూచించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు రూరల్ సీఐ టి.సుబ్రహ్మణ్యం, ఎస్ఐ తిరుపాల్ పాల్గొన్నారు.