పత్రాలు లేని వాహనాలకు జరిమానా : ఎస్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): అన్ని వాహనాలకు వాటికి సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని నందికొట్కూరు-నంద్యాల ప్రధాన రహదారి బ్రహ్మంగారి మఠం దగ్గర సిబ్బందితో కలిసి ఎస్సై వాహనాల తనిఖీ చేపట్టారు.ద్విచక్ర వాహనాలు ఆటోలు ట్రాక్టర్లు లారీలు తదితర వాహనాలను తనిఖీ చేస్తూ అదే విధంగా డ్రైవర్లకు లైసెన్సులు ఉన్నాయా లేదా అని వారిని అడిగారు.ఆటోలో అధికంగా ప్రయాణికులను ఎక్కించుకో రాదని డ్రైవర్లకు సూచించారు.వాహనాలకు పాత పెనాల్టీ ఉన్నట్లయితే వాటిని వెంటనే మీ సేవలో చెల్లించాలని అన్నారు.సరైన పత్రాలు లేని వాహనాలకుజరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. అదేవిధంగా వాహనాలను చిన్నపిల్లలు డ్రైవింగ్ చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాలాజీ సింగ్,ధనుంజయ, మన్సూర్,ఇస్మాయిల్ పాల్గొన్నారు.