PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలి

1 min read

ఫీజు రీయింబర్స్మెంట్ 2100కోట్లు వసతి దీవెన 1480  కోట్లు విడుదల చేయాలి

యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలి

పల్లెవెలుగు  వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని, యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి కు వినతిపత్రం అందించడం జరిగింది  ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విష్ణు, అబ్దుల్ ఖాదర్  బాషా  మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 2100 కోట్లు వసతి దీవెన 1480కోట్లు పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి నాలుగు క్వార్టర్ల రూపంలో డబ్బులు జమ అయ్యేటివి గత సంవత్సరం విద్యార్థులకు కేవలం ఒక క్వార్టర్ మాత్రమే విడుదల అయ్యి మిగతా మూడు క్వార్టర్లు విడుదల కాలేదని తెలిపారు రాష్ట్రంలో దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యను అభ్యసిస్తున్నారు దానిలో ఒక క్వాటర్ ఫీజులు 708 కోట్లు విడుదల చేశారు మూడు క్వాటర్లకు సంబంధించి దాదాపు 2100 కోట్లు విడుదల చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల కాక విద్యార్థులకు కోర్సులు అయిపోయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యులు మీరు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులకు తెలియజేస్తున్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారుగతంలో పెండింగ్లో ఉన్న డబ్బులు చెల్లిస్తేనే మీకు పరీక్షలకు అనుమతి ఇస్తామని కళాశాల యజమానులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇవ్వగలం పాదయాత్రలో మీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని పీజీ విద్యార్థులకు ఫీజు రిబర్స్మెంట్ వర్తింప చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పైబడిన ఇంతవరకు జీవో నెంబర్ 77 పైన మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వసతి  దీవెన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థుల కష్టాలు తీర్చాలని పేర్కొన్నారు.అదేవిధంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కళాశాల యాజమాన్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కి వసతి దీవెనకి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థినికి పరీక్షలు రాసేందుకు అనుమతించాలి అదేవిధంగా వారి సర్టిఫికెట్లు కూడా విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. నారా లోకేష్ గారు మా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని హామీ ఇచ్చినప్పటికీ ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులు విద్యాశాఖ మంత్రి మాటను గాలికి వదిలేసి విద్యార్థులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని మండిపడ్డారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఉన్నటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు సమీర్, హాజ,వీరేష్, నరసింహహు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *