పెండింగ్ లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలి… పి ఎస్ యు
1 min readపి ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎస్సి,బీసీ ఎస్టీ మైనారిటీ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి సురేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం ఎమ్మిగనూరు మీడియా ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వసతు గృహాలు 2733 ఉన్నాయి.వీటిలో మూడు లక్షల 13,695 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తి కావస్తున్న వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన మెస్ చ్చార్జీలు నేటి వరకు విడుదల కాలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుంతున్న నేపథ్యంలో, నెల నెల ప్రభుత్వం నుంచి రావాల్సిన మెస్ బిల్లులు విడుదల కాకపోవడంతో ప్రతి నెలా అప్పులు చేసి హాస్టల్స్ నిర్వహించడం వార్డెన్లకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే గత విద్యా సంవత్సరం మూడు నెలల వరకు కొన్ని హాస్టల్స్ కు బిల్లులు విడుదల కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం చలికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాస్టల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి బెడ్ సీట్లు, మూడు జతల యూనిఫాము, ప్లేట్లు పెట్టెలు, బకెట్లో మగ్గులు కూడా అందించాలని, హాస్టల్ ల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పక్కా రాష్ట్రం తెలంగాణలో లాగా ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు 2500 మిస్ చార్జీలు పెంచి గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లు వెంటనే విడుదల చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు అప్పుల బాధలనుండి ఉపశమనం కల్పించాలని కోరారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మధు,నవీన్ పాల్గొన్నారు.