‘కూటమి’.. పింఛన్లను ఒకేసారి పెంచింది: బుడ్డా శైలజా
1 min readవెలుగోడు, పల్లెవెలుగు:పింఛన్లు కూటమి ప్రభుత్వం ఒకేసారి పెంచి అమలు పరుస్తుందని – గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లు పెంచుకుంటూ పోయారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సతీమణి బుడ్డా శైలజా అన్నారు. సోమవారం మండల పరిధిలోని పట్టణంతోపాటు అన్ని గ్రామాలలో టిడిపి నాయకులు సచివాలయాల సిబ్బందిలతో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. మండల అధ్యక్షులు అన్నారపు శేషి రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఖలీల్ ఖాన్, మాజీ సర్పంచ్ కలాం, సీనియర్ నాయకులు అమీర్ హంజ్, అబ్దుల్ రజాక్, మోమిన్ రసూల్, హుస్సేన్ సాహెబ్, హిదాయత్ అలీ ఖాన్, మండ్ల శంకర్ రెడ్డి, చంద్ర, సూర్యనారాయణ, అమిర్ అలీ ఖాన్, భద్రుడు, ఎల్లాల కృష్ణుడు, పాలశంకర్ రెడ్డి, డాక్టర్ జాకీర్ హుస్సేన్, సంజీవ రాయుడు, మోత్కురు సుధాకర్ రెడ్డి, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.