PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడవద్దు

1 min read

ఏ.ఆర్.టి. మందులు సక్రమంగా వాడి, జీవితకాలం పెంపొందించుకోండి

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

రోగిని ద్వేషించకూడదు రోగాన్ని మాత్రమే ద్వేషించాలి

జిల్లా న్యాయసేవ అధికార  సంస్థ కార్యదర్శి  బి. లీలా వెంకట శేషాద్రి.

 పల్లెవెలుగు వెబ్  కర్నూలు :హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తులు అధైర్యపడవలసిన అవసరం లేదని,  ఏ.ఆర్.టి. మందులు సక్రమంగా వాడడం ద్వారా జీవితకాలం పెంపొందించుకోవటంతో పాటు, ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ డే – 2024 సందర్భంగా జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన  ర్యాలీని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి  బి. లీలా వెంకట శేషాద్రి  ప్రారంభించారు..’టేక్ ది రైట్స్ పాత్’ అన్న నినాదంతో ర్యాలీ ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని “హక్కుల మార్గాన్ని అనుసరించండి – నా ఆరోగ్యం, నా హక్కు” అనే నినాదంతో  నిర్వహించుకోవడం జరుగుతోందని తెలిపారు. హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వారికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ.ఆర్.టి. కేంద్రాలు, లింక్ ఏ.ఆర్.టి. కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందచేయటంతో పాటు, అవసరమైన సీడీ4 మరియు వైరల్ లోడ్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఏ.ఆర్.టి. మందులు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాడాలని,  అవగాహనా రాహిత్యంతో సక్రమంగా మందులు వాడని వారి ఇళ్ల వద్దకు క్షేత్ర స్థాయి సిబ్బందిని పంపి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వ్యక్తులకు కూడా సమాజంలోని ఇతర వ్యక్తుల మాదిరిగా సమాన హక్కులు ఉన్నాయన్నారు.. హెచ్.ఐ.వి. వ్యాధిని దూరం చేయాలని, హెచ్.ఐ.వి. తో జీవిస్తున్న వారిని ఆదరించాలని తెలిపారు. సమాజంలో రోగిని ద్వేషించకూడదని రోగాన్ని మాత్రమే ద్వేషించాలని సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.భాస్కర్ మాట్లాడుతూ తల్లి నుండి బిడ్డకు సంక్రమణ, వైరల్ లోడ్ పరీక్షల సేవలకు గుర్తింపుగా మన జిల్లాకు ఉత్తమ సేవల అవార్డు లు లభించాయని తెలిపారు..ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా నిర్వహించే అవగాహనా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా డిసెంబరు 15వ తారీకు వరకు కొనసాగుతాయని తెలిపారు.మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారు ఆత్మన్యూనత భావానికి గురి కావలసిన అవసరం లేదని, తెలిసి తెలియక హెచ్.ఐ.వి. బారిన పడినంత మాత్రాన కుంగిపోవలసిన పని లేదని, సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ అధికారులు కృషి చేస్తారని, అందువల్ల హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారు ధైర్యంగా ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో NHM DPMO డాక్టర్ ఉమ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, NCC అధికారి లెఫ్టినెంట్ రఘురాం, NCC 3rd ఆఫీసర్ గీతాంజిని, DSDO భూపతి, జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వెంకట రత్నం, NHM DPO విజయ రాజు, వైద్య, ఆరోగ్య శాఖ  DEMO శ్రీనివాసులు, చంద్ర శేఖర్ రెడ్డి, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం DRP నాగరాజు, ప్రభుత్వ నర్సింగ్ కాలేజి, గీతాంజలి నర్సింగ్ కాలేజి, సిల్వర్ జూబిలీ కాలేజి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజి ఫర్ మెన్, KVR కాలేజి, ఉస్మానియా, శంకరాస్ కాలేజి విద్యార్థులు NSS, NCC వాలంటీర్లు, రెడ్ రిబ్బన్ క్లబ్ సభ్యులు, చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం, విజయ మహిళా మండలి, SREDS, VHS స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *