ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
1 min readకలుషిత నీరు, దోమకాటుకు గురి కాకుండా జాగ్రత్తపడాలి
పేదలకు దుప్పట్లు దోమతెరలు చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు.. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లోనీ గురుదత్త పాలి క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పేదలకు సీజన్ వ్యాధుల నుండి రక్షించుకునేందుకు వీలుగా దుప్పట్లు ,దోమతెరలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సీజన్లో నీరు కలుషితం అయ్యే అవకాశం ఉందని, కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కలిసి తనీరు తాగడం వల్ల కలరా, కామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు .అందుకే ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆయన సూచించారు. అలాగే ఈ సీజన్లో దోమలు అధికంగా ఉంటాయని దోమ కాటుకు గురి కాకుండా ప్రతి ఒక్కరు దుప్పట్లు, దోమతెరలను వినియోగించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా దోమ కాటు వల్ల డెంగీ, మలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు అధికమయ్యాయని, మన రాష్ట్రం పక్కనే ఉండడం వల్ల మన రాష్ట్రంలో కూడా అవి ప్రబలే అవకాశం ఉందని సూచించారు .ఇప్పటికే మన రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో అతిసార వ్యాధి ప్రబలిన విషయాన్ని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వారానికి ఒకసారి గుడ్లు పౌష్టిక ఆహారం తీసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరు తమను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడం తోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అందరినీ ఆరోగ్యంగా ఉంచాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు.