నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండండి
1 min readఅధికారులు ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉండండి
గ్రామ ప్రజలు నదితీరా ప్రాంతాల్లోకి వెళ్లకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి
ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
పల్లెవెలుగు వెబ్ ఆదోని: నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం డివిజన్లోని కౌతాళం మండలం మేలగనూరు మరియు కుంబలనూర్ , నది తీర ప్రాంతాలను పరిశీలించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… వరద నీటి ప్రవాహంకు హోస్పేట్ లోని తుంగభద్ర ప్రాజెక్ట్ 19 గేట్ కొట్టుకుపోవడం ద్వారా 90 వేల క్యూసెక్కుల నీటి నుండి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా ఆదోని డివిజన్లో తీర ప్రాంతంలో ఉన్న కౌతళం, కోసిగి, నందవరం మండలలో నది తీర ప్రాంతాలకు భారీగా నీరు వస్తున్నందుగా అధికారులు ముందస్తుగా గ్రామంలోని ప్రజలను నది తీర ప్రాంతాలకు పోనివ్వకుండగా, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేసి ముందస్తుగా గజాయితగాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తీరప్రాంతంలో సంబంధిత మండల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోలు, వీఆర్ఏలు, ఇరిగేషన్, గజఈతగాళ్లు, అప్రమత్తంగా ఉండాలన్నారు. లైఫ్ జాకెట్లు, SDRF బృందాలను ఏర్పాటు చేసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ఆదోని డివిజన్లో రెండు టీం రాష్ట్ర విపత్తు రెస్క్యూ టీమ్స్ సిద్ధంగా ఉండగా వారికి పలు సూచనలు సబ్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమములో కౌతాళం తహశీల్దార్ మల్లికార్జునస్వామి, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.