పారిశుధ్యం పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలలో ఆయా గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు,పంచాయతీ సిబ్బంది కలిసి ప్రజలకు పారిశుద్ధంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ప్రజలు కూడా పారిశుద్ధ్యం పై అవగాహన కలిగి ఉండాలని ఈవోపీఆర్డి జి. సురేష్ బాబు పేర్కొన్నారు. చెన్నూరు ఎంపీడీవో సభ భవనంలో శుక్రవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ దివస్’ కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ఈవోపీఆర్డీ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతినెల మూడవ శనివారంను “పారిశుధ్య దినోత్సవం”గా అధికారులు ప్రకటించారని తెలిపారు.ఇందులో భాగంగా గ్రామాలలో రోడ్లపై వేసిన చెత్త కుప్పలను తొలగించాలని ఎక్కడ అపరిశుభ్రత కనపడకుండా పారిశుధ్యం పై తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. అలాగే మురికి కుంటలు ఉన్న చోట దోమలు వ్యాప్తి చెందకుండా దోమల నివారణ ఆయిల్ బాల్స్ వేయాలని,ఇళ్లలోని మురికి నీరు ఎక్కడ బయటకు రాకుండా ప్రతి ఇంటికి ఖచ్చితంగా జాలరి గుంత ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. అలాగే ఆయా గ్రామ పంచాయతీల్లో ‘అమృత్ సరోవర్ కింద చెరువులు ఏర్పాటై ఉంటే ఉపాధి హామీ కూలీలతో శుభ్రం చేయించాలని చెప్పారు. గ్రామపంచాయతీలను అన్ని శుభ్రం చేసి కనిపించేందుకు అందంగా తయారవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు,ప్రజలు భాగస్వామ్యం అయ్యేటట్లు చేయాలని అన్నారు. ప్రజలకు పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించేందుకు ఆయా గ్రామాల కూడళ్లలో మానవహారం ఏర్పాటు చేయాలని వివరించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ ఎపిఓ, పంచాయతీ సెక్రటరీలు ,సిబ్బంది, పాల్గొన్నారు.