PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి

1 min read

రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

స్వచ్ఛత అనేది జీవన విధానంలో భాగం కావాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచ‌న‌ల‌ను, ఆశ‌యాల‌ను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా 15 రోజులపాటు పటిష్టంగా నిర్వహించారని… ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యవంత సమాజ స్థాపనకు ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు.బుధవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అపరిశుభ్రతతో దుర్భర పరిస్థితిలో ఉన్న గ్రామాలను స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 రోజులపాటు పటిష్టంగా నిర్వహించారని… ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యవంత సమాజ స్థాపనకు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్రతిఒక్కరూ త‌మ ఇంటి ప‌రిశుభ్రత‌తోపాటు, గ్రామాల పరిశుభ్రత‌కు పాటుపడాల‌ని కోరారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జీవన విధానంలో స్వచ్ఛత అనేది ఒక భాగం కావాలన్నారు. స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అపరిశుభ్ర వాతావరణం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలి వేల రూపాయలు వైద్య ఖర్చులకోసం వినియోగిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత మన నుండే రావాలని మన దృక్పథాని మార్చుకొని మన జీవన విధానంలో స్వచ్ఛత అనేది ఒక భాగం కావాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి స్వచ్ఛతా హీ సేవా  కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు  సఫాయి కర్మచారులను సన్మానించుకోవాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఐదు సంవత్సరాలు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తే నంద్యాల జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మార్చుకోవచ్ఛన్నారు.జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు, ఏకో టూరిజం, పారిశ్రామిక రంగాలు అనేకం ఉన్నాయని స్వచ్ఛత అనేది తమ వంతు బాధ్యతగా తీసుకొని చెత్త నుండి సంపద కేంద్రాలు సృష్టించాలని కలెక్టర్ తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు జిల్లాలలోని సంపద కేంద్రాలకు చెత్త సరిపోవడం లేదని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేస్తూ తడి, పొడి చెత్తల ప్రాధాన్యత గురించి వివరించారు. రాబోయే రోజుల్లో చెత్త నుండి విద్యుత్ ఇతర విలువైన వస్తువులు తయారు చేసుకునే అవకాశం ఉందన్నారు.అనంతరం మంత్రి, కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకర్షించాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపీకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ పద్మజ, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, డిసిహెచ్ఎస్ జఫ్రుల్లా, డిపిఓ మంజుల వాణి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author