ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి … జిల్లా ఎస్పీ
1 min readజ్యూవెలరీషాపులు, షాపింగ్ మాల్స్, లాడ్జీల యాజమాన్యాలతో సమీక్షా సమావేశం
సైబర్ నేరంకు గురైతే గంట లోపే డయల్ 1930 కి ఫోన్ చేసి సమాచారం అందించండి
ప్రపంచంలో డిజిటల్ అరెస్టులు ఎక్కడా లేవు…సైబర్ నేరగాళ్ళు చేసే మోసాలు … నమ్మకండి
నేరాల కట్టడికి , నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహాకరించాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలులోని జ్యూవెలరీషాపులు, షాపింగ్ మాల్స్, లాడ్జీల యాజమాన్యాలతో జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ సమావేశం నిర్వహించారు. కర్నూలు పోలీసులు పట్టణంలో ఏవిధంగా పని చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…కర్నూలు జిల్లాలోనే ఇప్పటివరకి 11 కోట్ల వరకు ప్రజలు సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోయారన్నారు. రోజూ రోజూ కూ సైబర్ నేరాలు పెరిగి పోతున్నాయని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల బారిన పడి ఎక్కువగా మోసపోతున్నారన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 కి సమాచారం అందించాలన్నారు.1930 కి వెంటనే సమాచారం అందిస్తే బాధితులు నష్టపోయిన మొత్తాన్ని సైబర్ నేరగాళ్ల ఖాతాలకు పూర్తిగా వెళ్లకుండా కొంత డబ్బులు అయినా బ్యాంక్ ఖాతాలో ఫ్రీజ్ చేయించి, నష్ట శాతాన్ని బాధితులకు అందజేసే అవకాశం ఉంటుందన్నారు.డిజిటల్ అరెస్టులు ఏమీ లేవని, ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు నేరుగా వచ్చి అరెస్టు చేస్తారని, అన్ లైన్ లో డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవని నమ్మ వద్దన్నారు. అవి సైబర్ నేరగాళ్ళ మోసాలన్నారు. ఓటిపిలు, సిమ్ బ్లాక్, ఫ్రెండ్స్, రిక్వెస్ట్ లు, సోషల్ మీడియాలో ఫ్రాడ్స్, కోరియర్ ల పేరుతో, డ్రగ్స్ , గంజాయిల పేరుతో , వాట్సప్ విడియో కాల్స్ స్ర్కీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్, గిఫ్ట్ ల పేరుతో ట్యాక్స్ లు కట్టాలని, ఇన్సాస్టా గ్రాం , టెలిగ్రాంలలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని, డిజిటల్ అరెస్టులతో UTR ట్రాన్సా క్షన్స్ మోసాలు, అనవసర లింకులు క్లిక్ చేయవద్దని, డ్రగ్స్ కేసులో మీ అబ్బాయి ని కిడ్నాప్ చేస్తున్నామని, లాటరీ తగిలిందని, పలు రకాలుగా అమాయకులైన ప్రజలను, చదువుకున్నవారిని, చదువుకోని వారిని సైబర్ నేర గాళ్ళు సైబర్ నేరాలకు గురిచేస్తున్నారన్నారు. జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని నమ్మవద్దని, తెలిసిన బంధువులకు, స్నేహితులకు తెలియజేయాలన్నారు. అవగాహన చేయాలన్నారు బాధితులు సైబర్ క్రైమ్ పోర్టల్ లో www.cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు.షాపింగ్ మాల్స్, జ్యూవెలరీ, లాడ్జీల ముందు మన్నిక కలిగిన సిసి కెమెరాలు స్వచ్చంధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేరాల కట్టడికి , నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహాకరించాలన్నారు. కర్నూలు పట్టణంలో మరిన్ని సిసి కెమెరాలు అమర్చేందుకు మున్సిపల్ శాఖ సహాకారంతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. జిల్లాకు త్వరలో 100 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయన్నారు. కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుతుందన్నారు.పలు సమస్యల పై ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కి విన్నవించారు. స్పందిస్తూ చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో సిఐలు ప్రసాద్, కేశవరెడ్డి, అబ్దుల్ గౌస్, మన్సురుద్దీన్, శివశంకర్ , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు ఖాజావళి, హనుమంతయ్య, జ్యూవెలరీ, షాపింగ్ మాల్స్, లాడ్జీల యాజమాన్యాల వారు పాల్గొన్నారు.