PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంస్కృతిని పరిరక్షించే వ్యక్తులు.. సమాజానికి అవసరం

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.

ఘనంగా  ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తరతరాల నుండి వస్తున్న సంస్కృతిని పరిరక్షించి, ఈ దేశ పరంపరను కాపాడే వ్యక్తులు ఈనాటి  సమాజానికి ఎంతైనా అవసరముందని, ధర్మ పోరాటానికి సిద్దపడే మనస్తత్వాలు తయారుకావాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభా కార్యక్రమంలో వారు ప్రవచించారు. మూడు రోజులపాటు శ్రీనివాస రామానుజ దాసు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఈడిగ సుంకన్న, అనుమల ప్రకాశ్ గుప్త, కురువ ముని స్వామి, జి.గిడ్డన్న, కె.వెంకట రాముడు, రవిచంద్రా రెడ్డి, బి.అనంతయ్య, బి.రంగప్ప, ఇ.వెంకటేశ్, జె.శివ, లింగప్ప, బి.నాగప్ప, వి.తిరుపాలు, కె.మల్లమ్మ, కె.భగవాన్ నారాయణ, ఎల్.జయరాముడు, జూటూరు రంగముని, బి.కౌలుట్లతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ గ్రామ భక్త సమాజం అన్నసంతర్పణ చేశారు.

About Author