గ్రామ సభలో ప్రజల ఆగ్రహం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: జాతీయ రహదారి కొత్త రోడ్డు పైన నేషనల్ హైవే అధికారులు బస్ షెల్టర్, అలాగే జాతీయ రహదారి ఇరువైపులా అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలు, సర్వీసు రోడ్లు చేపట్టకపోవడంతో అటు ప్రజలు, ఇటు ప్రజా ప్రతినిధులు గురువారం నిర్వహించిన గ్రామసభలో పలు సమస్యలపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, గ్రామపంచాయతీ పరిధిలోని పలు సమస్యలు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇండ్లు, ఇళ్ల స్థలాలు కొత్త రోడ్డు ప్రాంతాలలోని ప్రజలు గ్రామసభలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు, పలు ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై ప్రత్యేక గ్రామ సభలో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు, గ్రామపంచాయతీ పార్కు నందు గురువారం ఉదయం పదిన్నర గంటలకు సర్పంచ్ వెంకటసుబ్బయ్య( కళ్యాణ్) అధ్యక్షతన ఓటీ ఎఫ్ పై సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ప్రజలు ప్రజా ప్రతినిధులు మాట్లాడడం జరిగింది, అలాగే పెడబల్లె సుధీర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ గ్రామపంచాయతీ అధికారులు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు తప్ప మౌలిక సదుపాయాలు కల్పించడం లో విఫలమయ్యారని తెలిపారు, చెన్నూరు కొత్త రోడ్డులో రహదారి పక్కన. చెన్నూరు బస్టాండ్ లో టీ అంగళ్లు. మాంసపు దుకాణాలు రోడ్లపై ఉన్నాయని వాటి వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సభ దృష్టికి తీసుకువచ్చారు, అలాగే కొత్త రోడ్డులో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికుల కోసం బుడ్డాయి పల్లె గ్రామానికి చెందిన ఆవుల బసిరెడ్డి సిమెంటు బల్లలు వేయగా అక్కడ ఉన్న దుకాణదారులు ఆ బెంచిలపై మురికి నీరు వేస్తూ ప్రయాణికులు కూర్చోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనిపై అధికారులు చొరవ తీసుకొని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు, చెన్నూరు కొత్త రోడ్డు పైన నాలుగు రోడ్ల కూడలిలో ప్రజలు అటు ఇటు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దానిపై అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని ప్రజలు అధికారుల దృష్టి కి తీసుకొచ్చారు, జాతీయ రహదారి కొత్త రోడ్డుపై హైవే అధికారులు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయలేదని దీని కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు, ఈవోపీఆర్టి. సురేష్ బాబు స్పందిస్తూ కొత్త రోడ్డుపై బస్సెల్టర్ ఏర్పాటుకు హైవే అధికారులు ముందుకు రానిపక్షంలో చెన్నూరు గ్రామపంచాయతీ నిధులతోనే బస్సు షెల్టర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు, అస్తవ్యస్తంగా ఉన్న కొత్త రోడ్డులోగల మాంసం దుకాణదారులకు అదేవిధంగా చెన్నూరు బస్టాండ్ లోనిటీ అంగళ్లు, ఇతర దుకాణ దార్లకు నోటీసులు పంపడం జరుగుతుందని ఈఓపిఆర్డి తెలిపారు, ప్రజలు మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని ఆరుబయట మలవిసర్జన చేయడం వల్ల వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ఆయన అన్నారు, త్రాగునీరు, పారిశుద్ధ్యం సీజన్ వ్యాధులపై చర్చించేందుకే ఓటిఎఫ్ గ్రామసభను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటసుబ్బయ్య,ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ వినోద్ కుమార్, ఏబీఎన్ గంగాధర్, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, సచివాలయ కార్యదర్శి సుప్రియ ,హెల్త్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.