ప్రజల నెత్తిన కరెంట్ బిల్లు బాదుడు…
1 min readసూపర్ సిక్స్ హామీలను గాలికి.. బాబు చెప్పిన ష్యూరిటి అంతా బోగస్..బాదుడు మాత్రం గ్యారంటీ
ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదు
వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరెంట్ చార్జీల బాదుడుపై వైకాపా పోరుబాట
మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు చార్జీలు పెంచనని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిన కరెంటు భారం మోపడం ఏమిటని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో వైకాపా రాష్ట్ర అధినేత ఆదేశాల మేరకు పెంచిన కరెంటు చార్జీలు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర సర్కిల్ నుండి విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సబ్ స్టేషన్ లో నిరసన చేపట్టారు. విద్యుత్ ఏడిఏ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి బూటకపు హామీలను గుప్పిస్తూ, కరెంట్ చార్జీలు పెంచబోనని, అవసరమైతే చార్జీలు తగ్గిస్తానని, వినియోగదారులే కరెంట్ అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికడం జరిగిందని తెలిపారు. అయితే చంద్రబాబు,అధికారం లోకి వచ్చిన తర్వాత కరెంట్ చార్జీల హామీని తుంగలో తొక్కి,ఆరు నెలల్లో దాదాపు 15 వేలకోట్ల రూపాయలను ప్రజల నెత్తిన కరెంట్ చార్జీలు పెంచడం దారుణమన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలి, పథకాలు అమలు చేయకుండా ప్రజల నుంచే వసూళ్లకు దిగడం అత్యంత హేయమని చర్య అని అన్నారు. ఎన్నికల సమయంలో బాబు చెప్పిన ష్యూరిటి అంతా బోగస్.. బాదుడు మాత్రం గ్యారంటీ అని అన్నారు. రానున్న జమిలి ఎన్నికల్లో ప్రజలందరి సహకారంతో రాష్ట్రంలో వైకాపా విజయం సాధించడమే కాకుండా,5వసారి కూడా ఎమ్మెల్యేగా నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు హోటల్ పరమేష్, మండల ఉపాధ్యక్షులు పులికుక్క రాఘవేంద్ర, బూదురు మల్లికార్జున రెడ్డి, మాలపల్లి గురురాజ స్వామి, సూగురు గోపి స్వామి, బొంబాయి శివ, పెట్రోల్ బంకు శ్రీనివాసులు, చెట్నహల్లి సర్పంచ్ ఆంజనేయులు, వగరూరు సర్పంచ్ కురువ లింగారెడ్డి, తిమ్మాపురం సర్పంచ్ వీరారెడ్డి, పెద్దకడుబూరు మండల నాయకులు పురుషోత్తం రెడ్డి, కోసిగి మండలం నాయకులు బెట్టన గౌడ్, నియోజకవర్గ నాయకులు, నాలుగు మండలాల ముఖ్య నాయకులు,యంపిపిలు, సర్పంచ్లు,యంపీటీసిలు, మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.