స్వచ్ఛ దివస్ లో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం
1 min readఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఏ గ్రామంలో ప్రజలు ఆ గ్రామంలో తమ నివాస గృహాల ముందు వెనకాల ఉన్న చెత్తాచెదారం మురికి కాలవల లో ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతోపాటు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ లో భాగంగా చెన్నూరులో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు పిఓపిఆర్డి సురేష్ బాబుల నేతృత్వంలో చెన్నూరు పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, ఎంపీడీవోలు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ కార్యదర్శులు ప్రజలను మమేకం చేసి వారికి స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. అంతే కాకుండా గ్రామాలలో ప్రతి ఇంటి ముందు వెనకాల ఉన్నటువంటి చెత్తా,చెదారం, వ్యర్థాలను తొలగించడంతోపాటు మురికి కాలువల నుండి పూడికలు తీయించడం, ఇరువైపులా ఉన్న కంపచెట్లు, పిచ్చి మొక్కలను తొలగించడం ద్వారా గ్రామాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని వారు తెలియజేశారు. అలాగే ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, రైతు సంఘాలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ మమేకమై పాడి పశువులు ఉన్న వారితో మాట్లాడి వారికి పేడ దిబ్బల గురించి క్లుప్తంగా వివరించి క్షేత్రస్థాయిలో స్వచ్ఛభారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, ప్రతినెల మూడవ శనివారం లో స్వచ్ఛ ఆంధ్ర. స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.