ప్రజల సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలి
1 min readలాగిన్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రజల సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారాల పై అధికారులతో సమీక్షించారు..పిజిఆర్ఎస్ కు సంబంధించి లాగిన్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొన్ని శాఖల అధికారులు లాగిన్ లో వచ్చిన దరఖాస్తులను ఓపెన్ చేసి చూడడం లేదని, ఈ అంశంలో నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.. సి.బెలగల్ తహశీల్దార్,కర్నూలు ఆర్డీఓ, వెల్దుర్తి తహశీల్దార్, మద్దికెర తహశీల్దార్,గూడూరు తహశీల్దార్, ఎమ్మిగనూరు తహశీల్దార్ 1 నుంచి 5 రోజుల్లోపు అర్జీలు చూడలేదని, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి 7 రోజులైనా చూడలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఎప్పటికప్పుడు సైట్ ఓపెన్ చేసి పరిశీలించి అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు..అదే విధంగా మండల విద్యాశాఖ అధికారి, ఆదోని లాగిన్ కు అర్జీ వచ్చి 14 రోజులైనా ఇంకా ఎందుకు ఓపెన్ చేసి చూడలేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ ను ఆదేశించారు.రీఓపెన్ కేసులకు సంబంధించి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, పత్తికొండ వద్ద 6 కేసులు రీఓపెన్ అయ్యాయని, వాటిని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు..అదే విధంగా సిఎంఓ గ్రీవెన్స్ లకు సంబంధించి ఇంకా 10 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు రూ.8కోట్లు మంజూరు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం రూ.8 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కలెక్టర్ వెల్లడించారు. వెంటనే APEWIDC ద్వారా పనులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. అదే విధంగా బిసి సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తుల కోసం నిధుల మంజూరు చేయాలని కోరుతూ సంబంధిత శాఖ ఉన్నతాధికారికి డిఓ లేఖను తయారుచేసి తీసుకురావాలని కలెక్టర్ బీసీ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.