PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధ్యతతో ఎన్నికల విధులను నిర్వహించండి

1 min read

స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కలెక్టర్ ను అభినందించిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతతో ఎన్నికల విధులను నిర్వహించాలని స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సాధారణ ఎన్నికల నిర్వహణపై జనరల్ అబ్జర్వర్లు, జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ లతో  కలిసి  స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ భద్రతా పరంగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహిస్తున్న వివిధ రకాల టీమ్ లకు  వాష్ రూమ్ సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు…ఈవిఎమ్ కమిషనింగ్ పనులు ఏ విధంగా జరిగాయి? పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించారు? వెబ్ కాస్టింగ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు??  ఇప్పటివరకు  ఎంత నగదును, లిక్కర్, బంగారం సీజ్ చేశారు?? బైండోవర్ కేసులు ఎన్ని నమోదు చేశారు??తదితర వివరాలను  కలెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు.. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ఈ సందర్భంగా స్పెషల్ జనరల్ అబ్జర్వర్ కలెక్టర్ ను అభినందించారు.తొలుత జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన జిల్లాలో ఎన్నికల నిర్వహణ కు తీసుకుంటున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  కర్నూలు జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2204 పోలింగ్ కేంద్రాలు (ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలలో కలిపి) ఉన్నాయని, సంబంధిత పోలింగ్ కేంద్రాలలో లే అవుట్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రం ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.పోలింగ్ కేంద్రాలలో వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వయో వృద్ధులు, వికలాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 1096 లొకేషన్ లలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు కనీసం 1 వీల్ చైర్ ఏర్పాటు చేశామని 1 లొకేషన్ లో రెండు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట 2 వీల్ చైర్ లు ఏర్పాటు చేశామన్నారు. బ్రెయిలీ ఓటర్ స్లిప్ లు ఈరోజు జిల్లాకు రానున్నాయని, వాటిని కూడా వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కర్నూలు జిల్లాలో 20 లక్షల 54 వేల 563 మంది ఓటర్లు ఉన్నారని అందులో పురుషులు 10 లక్షల 13 వేల 794 మంది, స్త్రీలు 10 లక్షల 40 వేల 451 మంది, ట్రాన్స్ జెండర్లు 318 మంది ఉన్నారని,  రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు కర్నూలు జిల్లాలో ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.ఓటర్ స్లిప్ లు 20 లక్షల 54 వేల 563 ప్రింట్ అయ్యాయని ఇప్పటివరకు  15 లక్షల 94 వేల 536 పంపిణీ చేయడం జరిగిందని పెండింగ్ లో ఉన్న 4 లక్షల 58 వేల 941 ఓటర్ స్లీప్ లు రేపటి లోపు పంపిణీ చేస్తామన్నారు.ఎస్పీ  తో కలిసి పరిశీలన చేసి 18 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను, 320 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, సంబంధిత పోలింగ్ కేంద్రాలు ఉండే ప్రాంతాలకు ఎస్పీతో  కలిసి అక్కడ ఉండే ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.  అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామనికలెక్టర్ తెలిపారు.స్వీప్ యాక్టివిటీ కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రత్యేక దృష్టి సారించి పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.జిల్లాలో అమలు చేస్తున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, వల్నరబిలిటీ  మ్యాపింగ్, ట్రాన్స్పోర్టేషన్ & కమ్యూనికేషన్ ప్లాన్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్విలియన్స్ టీమ్ లు నిర్వహిస్తున్న విధుల గురించి, పోలింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల గురించి, సువిధ లో ఇస్తున్న అనుమతుల గురించి, సి విజిల్ యాప్ గురించి, పోలింగ్ రోజున చేయనున్న ఏర్పాట్ల గురించి, ఈవిఏం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద చేస్తున్న ఏర్పాట్ల గురించి, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద తీసుకుంటున్న సెక్యూరిటీ గురించి పిపిటి ద్వారా కలెక్టర్ వివరించారు. సమావేశంలో  జనరల్ అబ్జర్వర్లు జాఫర్, మీర్ తారిఖ్ అలీ, పోలీసు పరిశీలకులు ఉమేష్ కుమార్, ఎన్నికల వ్యయ పరిశీలకులు ఆర్.ఆర్.ఎన్.శుక్లా, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, డిఆర్ఓ మధుసూదన రావు తదితరులు పాల్గొన్నారు.

About Author