PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాశ్వత నీటి పరిష్కారం కొరకు ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించండి

1 min read

కె సి కెనాల్ లో పెండింగ్ లో ఉన్న గుర్రపు డెక్కలను వెంటనే తొలిగించే విధంగా చర్యలు చేపట్టండి

నగరంలో  సీజనల్ వ్యాధులు రాకుండా  హైపో ద్రవం స్ప్రే చేయించే విధంగా చర్యలు చేపడతాం

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం & ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ నగరంలో శాశ్వత నీటి పరిష్కారం కొరకు  ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించడంతో పాటు కె సి కెనాల్ లో పెండింగ్ లో ఉన్న గుర్రపు డెక్కలను వెంటనే తొలిగించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం & ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.శనివారం స్థానిక  ప్రభుత్వ అతిథి గృహంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశాల పై సంబంధిత  అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి భరత్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు  అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత నీటి పరిష్కారం కొరకు ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించాలని ఇరిగేషన్ ఎస్ఈ ని మంత్రి ఆదేశించారు. రానున్న రోజుల్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు అంశాల మీద వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఎంఎల్ఏ లతో సమావేశం నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. హంద్రీ నది, కె సి కెనాల్ లో గుర్రపు డెక్కలు పెరగడంతో  దోమల సమస్య ఎక్కువగా ఉందని వాటి ద్వారా విష జ్వరాలు(డెంగ్యూ), సీజనల్ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే కె సి కెనాల్ లో పెండింగ్ లో ఉన్న గుర్రపు డెక్కలను తీసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.. హంద్రీ నదిలో ఉన్న గుర్రపు డెక్కలను కూడా వెంటనే తీసివేయడానికి  మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు..  నగరంలో  సీజనల్ వ్యాధులు రాకుండా  హైపో ద్రవం స్ప్రే చేయించే విధంగా మునిసిపల్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author