విద్యార్థులను క్రీడాకారులుగా మలిచేది పి.ఈ.టిలు
1 min readమాజీ రాజ్యసభ సభ్యులు టీజీ .వెంకటేష్
ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యాసంస్థల్లో క్రీడాకారులుగా మలిచేది వ్యాయామ ఉపాధ్యాయులని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వాక్యానించారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉత్తమ పిఈటి అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.విద్యాసంస్థలో క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించి క్రీడా పరికరాలను అందజేస్తే పీఈటీలు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో మల్చగలుగుతారని టీజీ వెంకటేష్ వాక్యానించారు. అలాంటి క్రీడాకారులను తయారు చేసే పి ఈ టి లకు ఉత్తమ పి ఈ టీ అవార్డుల ఇవ్వడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఉత్తమ పిఈటి గ్రహీతలైన ఎంఎండి భాష, సుబ్రహ్మణ్యం, కొండేపోగు చిన్న సుంకన్న, ఓబన్న, రాఘవేంద్ర ,సాలమ్మ సరళ, కళ్యాణి ,కవిత, లను స్పోర్ట్స్ పాటు శాలువా పూలమాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు, విశిష్ట అతిథి స్పోర్ట్స్ ప్రమోటర్ జి. శ్రీధర్ రెడ్డి, సి హర్షవర్ధన్, క్రీడా సంఘ ప్రతినిధులు దాసరి సుధీర్, గుడిపల్లి సురేందర్, నాగరత్నమయ్య, వంశి, ప్రభాకర్, మాజీ ఎస్ఎఫ్ఐ సెక్రెటరీ లక్ష్మయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొని సన్మాన గ్రహీతలను కరచాలనంతో అభినందించారు.