PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు వైసీపీలో పెత్తందారీ వ్యవస్థ

1 min read

యూత్ నాయకుడు యువతకు చేసిందేమి లేదు.

కాంగ్రెస్ పార్టీతోనే యువతకు ఉపాధి.

కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  నాగమధు యాదవ్.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు వైసీపీ లో పెత్తందారీ వ్యవస్థ నడుస్తుందని ఆ పార్టీలో దళిత ప్రజాప్రతినిధులకు అధికారాలు ఉండవని కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందికొట్కూర్ కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం నందికొట్కూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి  తొగరు ఆర్థర్ సమక్షంలో  షేక్ సద్దాం ఆధ్వర్యంలో హాజీ నగర్, మారుతి నగర్ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే అభ్యర్థి  తోగురుఆర్థర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం షేక్  సద్దాంను నందికొట్కూరు టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్  ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోగురు  ఆర్థర్  మాట్లాడుతూ యువకులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. అనంతరం నాగ మధు యాదవ్ మాట్లాడుతూ  నందికొట్కూరు లో 80 వేల మంది యువత ఉన్నారు. ఒక్కరికి ఉద్యోగం రాలేదు. యువజన విభాగం అధ్యక్షుడు గా ఉంటూ ఈ నియోజకవర్గానికి నీవు చేసిన అభివృద్ధి ఏది.నందికొట్కూరు ఎస్సీలకు స్వేచ్చ లేకుండా పోయిందన్నారు. ఈ నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే లను పని చేయకుండా అగ్రకుల పెత్తనం నడుస్తుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో  టీడీపీ వైసీపీ లలో  రెడ్ల ఆధిపత్యం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో పని చేసే నాయకులకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. క్రమశిక్షణతో కూడిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు.  ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ లాంటి మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  డిసిసి వైస్ ప్రెసిడెంట్  మానాపాటీ శ్రీనివాస్ గౌడ్,వెంకట్, షేక్నూర్ బాషా,షేక్ సబివుల్లాషేక్ మౌలాలి, అభినంద్, కిషోర్, రవి, మునాఫ్, రియాజ్, సలీమ్ తధితరులు పాల్గొన్నారు.

About Author