లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు పిలాంత్రోపిస్ట్ అవార్డు ప్రధానం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు 2024 వ సంవత్సరపు సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఏషియన్ ప్రేయర్ అండ్ హీలింగ్ స్టేషన్ ఇండియా అనే సంస్థ ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన వారికి గుర్తింపుగా ఇచ్చే అవార్డుల కార్యక్రమంలో భాగంగా బెస్ట్ పిలాంత్రోపిస్ట్ అవార్డును అంతర్జాలం ద్వారా నేడు అందజేశారు .విద్యా, ఉపాధి, సామాజిక సేవ, న్యాయ విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ,సామాజిక సమస్యలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం తదితర సేవా కార్యక్రమాల ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు.