షార్ట్ సర్క్యూట్ తో ఫోటో స్టూడియో దగ్ధం
1 min readరూ 10 లక్షల ఆస్తి నష్టం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఫోటో స్టూడియో దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని తుంగభద్ర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు జీలాన్ వివరాలు తెలిపారు. తుంగభద్ర (కాచాపురం) లో ఆంధ్ర ప్రగతి రాయలసీమ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్న కెయం బాష డిజిటల్ ఫోటో స్టూడియో లో షార్ట్ సర్క్యూట్ వల్ల దద్దమైందని తెలిపారు. ఫోటో స్టూడియోలో కంప్యూటర్ సిస్టం తో పాటు ల్యాప్‌టాప్ లు. నాలుగు డిజిటల్ కెమెరాలు. రెండు జిరాక్స్ మిషన్లు. పది ఆల్బమ్‌లో. తదితర వస్తువులు కాలి బూడిదైనాయని తెలిపారు. మొత్తం రూ 10 లక్షల రూపాయలు ఆస్తినష్టం ఉంటుందని తెలిపారు . ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.