పైలెట్ శిక్షణతో.. మెరవనున్న ‘కర్నూలు’
1 min read– పైలెట్ల కల సాకారం చేసేందుకే… ఓరియంట్ ఫ్లైట్స్ అకాడమీ..
- ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్
– మంత్రి టి.జి. భరత్ కు కృతజ్ఞతలు
కర్నూలు, పల్లెవెలుగు: భారతదేశంలోని అత్యుత్తమ పైలెట్ శిక్షణ సంస్థ అయిన ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ (OFAA ) దాదాపు మూడు దశాబ్దాలుగా 700 మందికి పైగా పైలట్లకు అత్యంత అర్హత కలిగిన మరియు అనుభవజ్ఞులైన బోధకులతో శిక్షణ అందించినట్లు ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ తెలిపారు. శుక్రవారం స్థానిక వెంకట రమణ కాలనీలోని ప్రాంతీయ కార్యాలయంలో అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ డా. ఆనంద్ జాకబ్ వర్గీస్ మాట్లాడుతూ…. ప్రస్తుతం మైసూర్ విమానాశ్రయంలో విస్తరిస్తున్న కొత్త విమానాల సముదాయం మరియు అతిపెద్ద హాంగర్లతో ఈ అకాడమీ ప్రపంచ ప్రమాణాలతో సమానంగా నాణ్యమైన శిక్షణను అందిస్తుంది. అటువంటి సంస్థ ఔత్సాహిక పైలట్ల కలలను సాకారం చేసేందుకు కర్నూలు నగరాన్ని ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఓర్వకల్లులో… విమానాల పార్కింగ్ హాంగర్స్…
ప్రస్తుతం ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ పూర్తిగా సమీకృత DGCA (డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్) ఆమోదించిన కోర్సులను అందిస్తుంది. అలాగే ప్రపంచంలోని అత్యుత్తమ అధీకృత శిక్షణ కేంద్రమైన IATA (ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) ద్వారా జాబ్ ఓరియంటెడ్ సర్టిఫైడ్ కోర్సులను అందిస్తుంది. ఈ శిక్షణా తరగతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో ఒక ఎకరా స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఆరు మాసాలలో పైలెట్ల శిక్షణ కొరకు విమానాల పార్కింగ్ హాంగర్స్ ను కూడా నిర్మించడం జరుగుతున్నది. ఈ శిక్షణా సంస్థ శిక్షణా తరగతులకు కేంద్రంగా కర్నూలు నగరంలోని, వెంకటరమణ కాలనీలో, H.P. పెట్రోల్ బంక్ ఎదురుగా సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగినది.
కోర్సుల వివరాలు:
1. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కోర్స్ (PPL),
* విద్యార్హత :10 వ తరగతి ఉత్తీర్ణత.
*వైద్య ప్రమాణాలు: ద్వితీయశ్రేణి మెడికల్ సర్టిఫికేట్
2. కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కోర్స్(CPL)
* విద్యార్హత :12 వ తరగతి ఉత్తీర్ణత.
*వైద్య ప్రమాణాలు: ప్రథమ శ్రేణి మెడికల్ సర్టిఫికేట్.
గమనిక: బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి కలదు.
* 2025 మార్చ్ నెల నుండి అడ్మిషన్లు ప్రారంభం కానున్నవి.
మరిన్ని వివరాలకు స్థానిక వెంకటరమణ కాలనీలోని ప్రాంతీయ కార్యాలయంలో లోకల్ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి ( 99519 77099, 98485 77099) ని సంప్రదించాలని తెలిపారు.
మంత్రి టి.జి. భరత్ కు కృతజ్ఞతలు:
ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్సిట్యూట్ ఏర్పాటులో పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ సహకరించారని, ఇందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ తెలిపారు. పరిశ్రమల శాఖకు సంబందించి ఇటువంటి ఇన్సిట్యూట్లు కర్నూలు కు వస్తే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ఈ సందర్భంగా మంత్రి టి.జి. భరత్ అభినందించినట్లు ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ వెల్లడ