పేరుకే పైపులైన్..డబ్బుల కోసం రోడ్డుని చీల్చారు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 12 వ వార్డు మారుతి నగర్ కాలనీలో గత 2014-19 టిడీపీ ప్రభుత్వంలో అప్పటి నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో చెక్కు చెదరని రోడ్లు వేశారు. కానీ 2023 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో డబ్బుల కోసం మంచినీటి పైపు కోసం చెక్కుచెదరని రోడ్డును చీల్చారు.నాణ్యతలేని పైపు లైన్ వేశారని రోడ్డు మధ్యలో ప్యాచ్ వర్క్ చేయకుండా మధ్యలోనే ఆపివేశారు. మారుతి నగర్ కాలనీ వాసులు రాత్రిపూట తిరగాలంటే క్రింద పడుతున్నామని కరెంట్ పోయిందంటే దారి కనపడక కింద పడడం వల్ల దెబ్బలు తగులుతున్నాయని కాలనీ వాసులు అంటున్నారు.ప్రజా ప్రతినిధులకు అధికారులకు చెప్పినా అటువైపు రావడం లేదన్నారు.అధికారులకు కూడా తెలియజేయగా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వంలో సీఎం ఆఫీస్ కు కూడా రిజిస్టర్ పోస్టు చేయడం జరిగిందన్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్యాచ్ వర్క్ వేయాలనీ కాలనీవాసులు కోరుకుంటున్నారు.ఈ విషయంపై ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరగా వర్క్ ను పూర్తిగా చేస్తే బిల్లు పెడతామన్నారు.