రగ్బీ ఆడుతున్నారంటే యుద్ధానికి సిద్ధమైనట్లే ఎంపీ. బైరెడ్డి శబరి
1 min readముగిసిన అస్మిత రగ్బీ మహిళా లీగ్ పోటీలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహిళలు రగ్బీ సాధన చేస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్లేనని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వాక్యానించారు.ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేక మైదానంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇతర ఆటలతో పోలిస్తే ఈ గేమ్ కొంత డిఫరెంట్ గా ఉంటుందని ఆమె అన్నారు. ఇటువంటి గేమ్‌లు సాదా చేయడం మహిళలు తమకెంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే ఇలాంటి పోటీలు నంద్యాల నియోజకవర్గంలో జరగడం అందులో ఆర్జీఎం కళాశాలలో జరగటం మరింత సంతోషంగా ఉందన్నారు.అనంతరము మొదటి స్థానం సంపాదించిన గుంటూరు జిల్లా మహిళా జట్టుకు గోల్డ్ మెడల్స్ తో పాటు 50 వేల రూపాయల చెక్కును అందజేసి అభినందించారు. రెండవ మూడవ స్థానంలో నెగ్గిన పశ్చిమగోదావరి, నంద్యాల ఆర్జియం జట్లకు సిల్వర్ మెడల్స్ తో పాటు 30, 20 వేల చెక్కును అందజేశారుఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్జియం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ అశోక్, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, నంద్యాల ఇన్చార్జీలు నిమ్మకాయల సుధాకర్, కొండేపోగు చిన్న సుంకన్న, స్పోర్ట్స్ అథారిటీ పరిశీలకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.