స్వచ్ఛత ప్రతిజ్ఞ… పరిసరాలను శుభ్రం
1 min readస్థానిక ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపోలో
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో ఉద్యోగులంతా స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా కలిసి ఎమ్మిగనూరు శాసనసభ్యులు, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బి . వి.జయ నాగేశ్వర్ రెడ్డి గారు స్వచ్ఛత లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించిన చోట శ్రమదానం చేసి చెట్లు నాటిన డిపో మేనేజర్ బి అమర్నాథ్ తో పాటు అకౌంట్స్ ఆఫీసర్ కుమార్ , మెకానికల్ ఫోర్ మెన్ బాల ఆంజనేయులు, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్యదర్శి ముస్తాక్ అహ్మద్, ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి ఎంఎస్ వాసులు, ఎల్ .హెచ్. గంగన్న , రికార్డ్ ట్రేసర్ శ్రీమతి ముంతాజ్, గారలు చెట్లు నాటారు. మరియు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ బి అమర్నాథ్ సారథ్యం వహించి స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతను అనుసరించి మేము స్వచ్ఛత కొరకు కట్టుబడి ఉంటామని, అందుకొరకు మా సమయాన్ని అంకితబద్దం చేస్తామని, సంవత్సరానికి 100 గంటలు అంటే వారానికి రెండు గంటలు చొప్పున పరిశుభ్రత కొరకు స్వచ్ఛందంగా పాటుపడతామని, బహిరంగ ప్రదేశాల్లో చత్తవెయ్యము, ఇతరులతో వెయ్యనీయమని, పరిశుభ్రత అన్నది దైవంతో సమానమని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుటకు తమ వంతు కృషి చేస్తూ అందులో భాగంగానే మాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన విధంగా డిపోలోని టాయిలెట్లను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించి బస్టాండ్ పరిసర ప్రాంతంలో బాదం చెట్లు నాటి ఉద్యోగులతో ఉదయం 10 గంటలకు ప్రతిజ్ఞ చేయించి శ్రమదానం చేశారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా విభాగం అయిన ఏపీఎస్ఆర్టీసీ ఎమ్మిగనూరు డిపోలో “స్వచ్ఛతే సేవ పక్షోత్సవాలు” సెప్టెంబర్ 17 వ తారీకు నుండి అక్టోబర్ 1వ తారీకు వరకు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో అందరూ ఉద్యోగులు పాల్గొని తమ ఇంటి పక్కన మరియు ముందు ఎటువంటి చెత్త వేయకుండా తమ వంతు కృషిగా చేయాలని ఈ సందర్భంగా డిపో మేనేజర్ కోరారు. స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత పరిసరాల స్వచ్ఛత శుభ్రత మనందరి బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ యూనియన్ తరపున పాణ్యం నుండి బాదాం చెట్లను తెప్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఎమ్మెస్ వాసులు, బసవరాజు, శ్రీరాములు,ఏ డి సి ఎన్. పి. ఎం. సాహెబ్ , గంగన్న , చాంద్ భాషా, రిటైర్డ్ ఎంప్లాయిస్ సెక్రెటరీ నారాయణ, సిఎండి దావూద్, యు. గోపాల్ మరియుఉద్యోగులు పాల్గొన్నారు.