సాగునీటి కోసం రైతన్నల అవస్థలు..
1 min readఅలగనూరు రిజర్వాయర్ ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు..
గత సర్కార్ నిర్లక్ష్యానికి రైతులకు శాపం
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలో పంటలు వేసుకున్న రైతుల కష్టాలు అంతా ఇంతా కావు. రెండు నెలలైనా వర్షాకాలం మొదలై ఇప్పటివరకు సరైన వర్షాలు లేక పంటలకు నీరు అందక. రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఈఏడాది వర్షాలు రావడమే ఆలస్యంగా వచ్చాయి. మే చివరి వారంలో వితుకున్నటువంటి పత్తి విత్తనాలు వర్షాలు లేక మొలకెత్తకపోవడంతో జూన్ చివరి వారంలో రైతులు మళ్లీ పత్తి విత్తనాలను నాటారు. తొలకరి జల్లులు కురుస్తున్న సమయంలో రెండవసారి విత్తనాలను నాటిన రైతులకు భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఆ వర్షాలకు సైతం తట్టుకొని ఉన్న పంటలు ప్రస్తుతం నీటి తడులులేక అల్లాడుతున్నాయి. పూత దశలో ఉన్న పంటలన్నీ వర్షం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితులనుంచి తమను గట్టేక్కించాలని రైతులు దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. గడివేముల మండలంలో అలగనూరు రిజర్వాయర్ నుండి వచ్చే నీటితో వేల ఎకరాల్లో రైతులు సాగు చేసేవారు. గత మూడు నాలుగు సంవత్సరాలు నుండి రిజర్వాయర్ మరమ్మతులకు గురి కావడంతో నీటిని నింపలేదు, గత వైసిపి సర్కార్ నిర్లక్ష్యానికి రైతులు బలయ్యారు. మరమ్మతులు చేపట్టడానికి నిధులు విడుదల చేయకపోవడంతో అప్పటి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆర్థర్. డిఆర్సి మీటింగ్లో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నిధులు విడుదల చేయకపోవడంతో అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులకు నోచుకోక మూలన పడడం పెద్ద సమస్యగా మారింది రిజర్వాయర్ నుండి కుందుకు నీరు విడుదల చేయడం మండలంలోని రైతులకు కలసొచ్చేది. ఈసారి వర్షాలు లేక రైతులు కేవలం బోర్లు, బావులు మరియు వర్షాభవ పరిస్థితుల మీదనే ఆధారపడి పొలాలు పండించుకుంటున్నారు. వేసిన పంటలకు నీరు అందక రైతులు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడించి నీటిని విడుదల చేయించుకున్నారు. బానక చర్ల నుండి అలగనూరు రిజర్వాయర్ లోకి కేసి కాలువలో నీటిని విడుదల చేయించుకున్నారు. కాలువ నీరు వృధాగా ఎస్ఆర్బిసిలోకి వెళ్లడంతో శనివారం నాడు గడివేముల ,కొర్రపోలురు ,ఆర్లగడ్డ రైతులు కలిసి సొంత ఖర్చులతో జెసిబి సహాయంతో కేసీ కాలవ దగ్గర పడిన గండిని పూడిపించారు. కేసి కాల్వ నుండి నీరు రిజర్వాయర్ మీదుగా చిన్న తుం ద్వారా కుందునదిలోకి ప్రవహిస్తున్నడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు సహకరించిన మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.