మహానంది లో పిఎంజి పూజలు…
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మహానందీశ్వర స్వామి సన్నిధిలో కర్నూలు రీజనల్ పోస్టుమాస్టర్ జనరల్ ఉపేంద్ర పూజలు నిర్వహించారు. శుక్రవారం స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయన కు ఆలయ ముఖమండపం వద్ద టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు,స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాశమేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆనవాయితీ ప్రకారం కళ్యాణ మండపంలో వేదపండితులు నాగేశ్వర శర్మ, హనుమంతు శర్మల వేదాశీర్వచనం తో దుషాలువ కప్పి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఆయన వెంట ఏ ఎస్పీలు సత్యనారాయణ, పార్వతి, పోస్టల్ శాఖ ఉద్యోగులు వెంకటేశ్వర రెడ్డి, తదితరులు ఉన్నారు.