శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే
1 min readఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన కార్యనిర్వహణాధికారి ఆర్.వి చందన
కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో పోటెత్తిన భక్తులు
వివిధ సేవల రూపేణ రూ:7,30,906/లు ఆదాయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద కార్తీకమాసోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహింపబడుచున్నవి. ఈరోజు శ్రీ స్వామి వారి దర్శనార్దం పోలవరం శాసన సభ సభ్యులు చిర్రి బాలరాజు విచ్చేసి శ్రీ స్వామి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం వారిని ఆలయ కార్యనిర్వహణాధికారిణి శ్రీ స్వామి వారి శేష వస్త్రములతో సత్కరించి, చిత్రపటమును బహుకరించగా, ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం గావించి తీర్ధ ప్రసాదములు అందజేశారు. కార్తీకమాసం,ఆఖరి మంగళవారం కావడంతో వేకువఝాము నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి, దీపారాదనలు చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం గం4.00లకు తీర్ధపు బిందె, ప్రాతః కాలార్చన, తోమాలసేవ అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు, శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు, భక్తులు అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.7,30,906/- లు సమకూరినది.ఈరోజు చక్రదేవరపల్లి గ్రామస్తులు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయము వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంచేశారు. ఆలయమువద్ద అగ్నిమాపక, పోలీసుశాఖ మరియు బొర్రంపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది సేవలు అందించారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయకార్యనిర్వహణాధికారిణి మరియు సహాయ కమిషనర్ ఆర్.వి.చందన తెలిపారు.