ట్రాఫిక్ నియంత్రణ పై పోలీసులు చర్యలు
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం లో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ నియంత్రణ విషయంలో సిఐ రామాంజులు ఆధ్వర్యంలో ఎస్ఐ పరమేష్ నాయక్ పోలీసులు చర్యలు చేపట్టారు. శుక్రవారం స్థానిక రాఘవేంద్ర సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రహదారిలో ఉన్న వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టిన బోర్డులను వస్తువులను తీసివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది దగ్గరుండి వాహన దారులను దుకాణ యజమానులను హెచ్చరించి అపరాధ రుసుం విధించారు. రోడ్డు పై అడ్డ దిడ్డంగా ఉంచిన ద్విచక్ర వాహనాలకు ఫైన్లు వేశారు. ఈ విధంగా మరోసారి రోడ్డు పై అడ్డంగా ఉంచరాదని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు రమణ కానిస్టేబుల్ పరమేష్ సోమశేఖర్ జమీర్ హోం గార్డు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.