మాండ్ర..బైరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పోలీసులు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డిని మరియు నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు వారి గృహాల్లో వేరు వేరుగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శివానందరెడ్డిని అల్లూరులోని ఆయన స్వగృహంలో ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణ,రూరల్ సీఐలు వై ప్రవీణ్ కుమార్ రెడ్డి,పి సుబ్రహ్మణ్యం,ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి,ఎస్ఐలు కొత్తపల్లి కేశవ, బ్రాహ్మణ కొట్కూరు తిరుపాలు,నందికొట్కూరు చంద్రశేఖర్ రెడ్డి,ముచ్చుమర్రి శరత్ కుమార్ రెడ్డి, జూపాడుబంగ్లా లక్ష్మీనారాయణ, పాములపాడు సురేష్ బాబు కలసి శివానందరెడ్డి దంపతులకు పూల బోకేలతో శుభాకాంక్షలు తెలిపారు.కేక్ కట్ చేసి శివారెడ్డిని శాలువాల తో వారు సన్మానించారు. తర్వాత నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి స్వగృహంలో పోలీసులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలిసి కేక్ కట్ చేసి పూల బోకెలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.