ముచ్చుమర్రి కేసులో పోలీసుల వైఫల్యం..
1 min read-బాధ్యత కుటుంబానికి అండగా ఉంటా
-ఒకరిని చదివిస్తా:వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని మచ్చుమర్రి గ్రామంలో ఈనెల 7వ తేదీన అదృశ్యమైన బాలికను పోలీసులు ఎందుకు చేదించలేదని నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ధారా సుధీర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన ముచ్చుమర్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేశారు ఒకరిని చదివిస్తానని అన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాలిక అత్యాచార కేసుల్లో 12 రోజులు అవుతున్నా ఈ కేసును పోలీసులు ఎందుకు ఛేదించడం లేదని నిందితులు అదుపులో ఉన్న పాప ఆచూకీ కనిపెట్టలేక పోవడం ఏమిటని ఆయన పోలీసులను ప్రశ్నించారు.దీని వెనకాల ఎవరైనా పెద్దల హస్తం ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు.బాలిక శవాన్ని గుర్తించడంలో పోలీసులు వైఫల్యం చెందారని ఈ కేసులో పోలీసులు సస్పెండ్ చేస్తూ కేసును నీరు గారుస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయని అన్నారు.బాలిక ఆచూకీ కనిపెట్టలేక పోవడం ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని హోంమంత్రి వెంటనే స్పందించి మూడు రోజులు అవుతున్నా కుటుంబానికి న్యాయం చేయలేదని ప్రభుత్వం ఎక్స్ గ్రేసియా ప్రకటించి మూడు రోజులు అయినా బాధిత కుటుంబాన్ని ఎందుకు అందించలేదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి పుల్యాల నాగిరెడ్డి,మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు,సింగిల్‌విండో మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, జూపాడుబంగ్లా జెడ్పిటిసి జగదీశ్వర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్ఢ్ చైర్మన్ తువ్వా శివరామకృష్ణా రెడ్డి,కౌన్సిలర్ నాయబ్ తదితరులు పాల్గొన్నారు.