ఎన్నికల విధులలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
1 min readసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించి మరియు పోలింగు కు 48 గంటల ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడమైనది.
కర్నూలు రేంజ్ డీఐజీ సిహెచ్ .విజయ రావు ఐపియస్
కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్
ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మే 13 తేదీ , 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు లలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ సిహెచ్ .విజయ రావు ఐపియస్ , కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ కలిసి శుక్రవారం భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి సంబంధిత పోలీసు అధికారులతో అడిగి తెలుసుకున్నారు . ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు గురించి ఆరా తీశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిసి కెమెరాల నిఘా, వీడియో కెమెరాలు , పోలీసు బలగాలతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ సిహెచ్. విజయ రావు ఐపీఎస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ రేంజ్ డీఐజీ తో పాటు కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ , డీఎస్పీలు శివ నారాయణస్వామి, శ్రీనివాసరెడ్డి ,బి.సీతారామయ్య, సిఐలు, ఎస్ఐలు ఉన్నారు .