పోలీసుల దాడులు..నాటు సారా స్వాధీనం:సీఐ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సోమవారం ఉ.8 గంటల సమయంలో పట్టణంలోని షికారి పేటలో పట్టణ సీఐ ప్రకాష్ కుమార్ ఆధ్వర్యంలో ఆ కాలనీలో రూరల్ సీఐ విజయభాస్కర్ మరియు పోలీసుల కార్డెన్ సర్చ్ నిర్వహించారు.కాలనీలో పోలీసులు కలియ తిరుగుతూ సారాయి అమ్మటం వలన జరిగే నష్టాల గురించి అంతేకాకుండా మీపై కేసులు నమోదు కావడం వలన మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని కాలనీవాసులకు సీఐలు అవగాహన కల్పించారు.సారాయి తయారు చేస్తున్న వాటిపై పోలీసులు దాడులు చేసి 30 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు మరియు నీటి బిందెల్లో ఉన్న 300 లీటర్ల బెల్లం ఊట బిందెలను ధ్వంసం చేశారు.ఒక వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రకాష్ కుమార్ తెలిపారు. సారాయి తయారు చేసినా అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఆయన కాలనీవాసులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు ఎస్ఐ జగన్ మోహన్,ఏఎస్ఐ సుబ్బయ్య మరియు సర్కిల్ లోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.