కోడి పందాలపై పోలీసుల దాడులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహానంది, జనవరి13,పల్లెవెలుగు. నల్లమల అటవీ సమీప ప్రాంతంలో కోడిపందాలు ఆడుతున్న వారిపై మహానంది పోలీసులు దాడులు నిర్వహించినట్లు ఎస్ ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా, మహానంది మండల పరిధిలోని బసవాపురం నల్లమల అటవీ సమీప ప్రాంతంలో కొందరు కోడిపందాలు అడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బంది సహకారంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అక్కడ కోడిపందాలు ఆడుతున్న దాదాపు12 మందిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసిన్నట్లు తెలిపారు.వారివద్ద 23వేల 5వందల నగదుతో పాటు, 19 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే ఒక ఆటో,5 పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు.మరికొందరు పరారైనట్లు తెలిపారు. వారికోసం విచారణ చేస్తున్నట్లు తెలిపారు.