PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెసరవాయ్ గ్రామంలో పోలీసుల సోదాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడే కొద్ది గ్రామాల్లో శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా పోలీసులు రోజు తమ సిబ్బందితో సోదాలు నిర్వహిస్తున్నారు.మండల పరిధిలోని పెసర వాయి గ్రామంలో బుధవారం నాడు పాణ్యం సి.ఐ నల్లప్ప, ఎస్సై బీ.టి వెంకటసుబ్బయ్య పోలీసు సిబ్బందితో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్సైలు మాట్లాడుతూ  జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్పి ఆధ్వర్యంలో పెసర వాయి గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలోని అనమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించామన్నారు. శాంతిభద్రతల దృష్టా సమస్యాత్మక గ్రామాల్లో ఈ సోదాలు నిర్వహించడం జరుగుతుందని. ఎన్నికల లెక్కింపును దృష్టిలో ఉంచుకొని  గ్రామాల్లో ఎలాంటి అల్లర్లు, అసాంఘీక కార్యక్రమాలకు చోటువివ్వకుండా ముందస్తుగా ఉన్నతాధికారు లు ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎవ్వరైనా నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లకు, అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, ఎంతటివారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author