PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిద్ధార్థ రెడ్డి ని అడ్డుకున్న పోలీసులు..

1 min read

పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన పోలీసులు

రోడ్డుపై బైఠాయించి కార్యకర్తలు ధర్నా

అంత మంది పోలీసుల సమయం వృధా కాదా..

తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే

ప్రభుత్వాన్ని కోరిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని ముచ్చుమర్రి గ్రామానికి చెందిన గత ఆరు రోజుల వాసంతి చిన్నారి మృతి చెందిన సంఘటన తెలిసిందే..శుక్రవారం మ.12 గం.కు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కర్నూలు నుండి ముచ్చుమర్రి గ్రామానికి వెళ్తున్న శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ని బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు వాహనాన్ని ఆపారు.మీరు ముచ్చుమర్రి కి వెళ్లడానికి వీలు లేదని రూరల్ సీఐ విజయభాస్కర్ అన్నారు. మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు.ఒక అమ్మాయి చనిపోతే కుటుంబ సభ్యులను ఓదార్చడానికి నేను వెళ్తున్నా ఎవ్వరికీ లేని అనుమతి నాకు ఎందుకు..ఒకవేళ బాధితులు నన్ను వాళ్ళ ఇంటికి రావద్దని అని ఉంటే చెప్పండి నేను వెనక్కి వెళ్ళిపోతానంటూ సిద్ధార్థ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.నేను లా అండ్ ఆర్డర్ కు ఇబ్బంది కలిగిస్తున్నానా అని సిద్ధార్థ అనగా వద్దు మీరు వెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సీఐ చెప్పారు. మీ జీపులోనే నన్ను తీసుకెళ్లండి మా వాళ్ళు ఎవ్వ రూ రారు తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానంటూ సిద్ధార్థ పోలీసులపై విరుచుకుపడ్డారు. సిద్ధార్థ రెడ్డిని బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు.బాధిత కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.సిద్ధార్థ రెడ్డి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు.స్టేషన్ బయట రహదారిపై కార్యకర్తలు  బైఠాయించి ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ భారీ ఎత్తున ధర్నా చేశారు.తర్వాత సిద్ధార్థ రెడ్డిని బయటికి వదిలిన తర్వాత పాత్రికేయులతో మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం మంచి పద్ధతి కాదని దీనిపట్ల ఎవరి ఒత్తిడి ఉందోనని స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది కొత్త అనుమానాలు రేకెత్తించే విధంగా వేస్తున్నారు.దేనికోసం నన్ను అడ్డుకుంటున్నారు. హత్యకు పాల్పడిన వారిని మరియు దీని వెనకాల ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని మిగతా వాళ్లకు భయం ఉండే విధంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబానికి ధైర్యం నింపాలని వచ్చాం ఎంతోమంది పోలీసులు వచ్చి మిమ్మల్ని ఆపారు.కాలువ దగ్గర పోలీసులు సెర్చింగ్ చేయాల్సింది పోయి అంతమంది పోలీసులు ఇక్కడ ఉండడం అదంతా సమయం వృధా కాదా..కొందరికి లాటరీల ద్వారా పదవులు వచ్చాయ్ పదిమందికి మంచి పనులు చేసే విధంగా ఉండాలి ఇలాంటి నీచమైన పనులు చేయడం దుర దృష్టకరమని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు.

About Author