PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెరువు నీళ్లు..రైతుల గొడవలకు ఫుల్ స్టాప్

1 min read

-రెండో పంట వేయవద్దు-త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం

-ఎలాంటి గొడవలు వద్దు..-గ్రామాల రైతులతో సమావేశమైన ఆర్డీవో..డీఎస్పీ

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): జలకనూరు మద్దిగుండం చెరువు నీళ్ళను మోటార్ల ద్వారా ఒక గ్రామ రైతులు పొలాలకు నీళ్లను కట్టుకుంటుంటే మీరెలా నీళ్లను వాడుకుంటారు ఆ నీళ్ళు మా పంటలకు కావాలి అంటూ మరో గ్రామ రైతులు ఇలా గత ఐదు రోజులుగా రెండు గ్రామాల రైతులు తోసుకోవడం వరకు వచ్చింది ఆ రెండు గ్రామాల రైతులు కలెక్టర్ ఎదుట కూడా ధర్నా చేపట్టారు నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని జలకనూరు, సుంకేసుల గ్రామాల రైతులు.. రెండు గ్రామాల రైతులకు సమస్య తీవ్రంగా కాకుండా గ్రామాల రైతులకు నచ్చచెబుతూ రైతుల మధ్య సమస్యను అధికారులు రైతులతో మంగళవారం సమావేశమై రైతులకు ఉన్న సందేహానికి ఫుల్ స్టాప్ పెట్టారు. మద్దిగుండం చెరువు నీటి వినియోగ సమస్యపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆత్మకూరు ఆర్డీఓ దాసు,డీఎస్పీ పి రామాంజి నాయక్,ఇరిగేషన్ ఈఈ,ఎలక్ట్రిషన్ ఈఈ ల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో త్రీసభ్య కమిటీ ముందు రైతులతో సమావేశం నిర్వహించారు.జలకనూరు గ్రామ రైతులు మాట్లాడుతూ మాకు మాత్రమే హక్కు ఉందని సుంకేసుల గ్రామ రైతులు అక్రమ విద్యుత్ కనెక్షన్లను ఏర్పాటు చేసుకొని మోటార్లతో మద్దిగుండం చెరువులో నీటిని ఖాలీ చేస్తున్నారని నీరు పంట  చేతికి వచ్చే సమయానికి చెరువులో చుక్కనీరు ఉండడం లేదని అధికారుల ముందు వాపోయారు.దీనికి సంబంధించిన అధికారులు తూమును మరమ్మతు చేసి నీటిని అనవసరంగా వృధా కాకుండా కాపాడుతామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇచ్చారు.ఖరీఫ్ సీజన్ వరకు నీటిని సుంకేసుల రైతులు వినియోగించుకోవాలని రబీ సీజన్ కు రెండో పంట వేయొద్దని అధికారుల ముందు రైతులు ఒప్పుకోవడంతో  రైతులతో ఒప్పంద సంతకాలు చేయించారు.ఇరు గ్రామాల రైతుల సమన్వయంతో సమస్య పరిష్కారం అయ్యిందని అధికారులు తెలిపారు.తర్వాత రబీ సీజన్లో అందరికీ అమోదం అయ్యేలా నాయకులను అధికారులను కలిసి ఎస్ఆర్బిసీ కాలువ నుండి నీటిని చెరువుకు తరలించేలా ప్రయత్నం చేస్తామని అంతవరకు రైతులు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి రెండు గ్రామాల సాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని అంతవరకు ఏలాంటి గొడవలకు తావు లేకుండా ఉండాలని డీఎస్పీ రామాంజి నాయక్   నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం రైతులను హెచ్చరించారు.జలకనూరు గ్రామస్తులు రెవిన్యూ విద్యుత్ శాఖ అధికారులు తప్పిదం వల్లనే ఈ నష్టం జరుగుతుందని అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని దీనిపై పూర్తి సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలు అందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా ఎస్ఐ ఓబులేష్ ఆధ్వర్యంలో పటిష్ట  బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ జయశంకర్,ఇరిగేషన్ ఈఈ రఘురామిరెడ్డి,విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాసులు,ఏఈ క్రాంతి కుమార్,ఏఈ మోహన్ రెడ్డి, సుంకేసుల,జలకనూరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

About Author