హంద్రీనీవా ద్వారా చెరువులకు నీళ్లు నింపాలి… బి. గిడ్డయ్య
1 min readసమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా జిల్లాలోని 106 చెరువులకు నీళ్లు నింపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక చదువుల రామయ్య భవనంలో సిపిఐ శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో పార్టీ శాఖలను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు చేపట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధపడాలన్నారు. కేంద్రంలో బిజెపి నైతికంగా ఓడిపోయిందని, ఇండియా కూటమికి మెరుగైన స్థానాలు వచ్చాయన్నారు. మోడీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనాకాలంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి, అరాచక పాలన చేయడం వల్లే గత ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల వేదవతి, గుండ్రేవల, ఆర్డిఎస్, హంద్రీనీవా జిల్లా రైతన్నకి సాగునీరు తాగునీరు ఇచ్చి ఎడారి కాకుండా కాపాడాలని కోరారు. ప్రాజెక్టులపై గత అనేక సంవత్సరాలు నుండి పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికి, ప్రభుత్వాలు మారి హామీలు ఇస్తున్నారు తప్ప ఈ జిల్లాలో ఉన్న పంట భూములకు సాగునీరు ఇచ్చే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. హంద్రీనీవా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీళ్లు నింపి, పిల్ల కాలువ స్థిరీకరణ పనులను పూర్తిచేసి ఈ ఖరీఫ్ సీజన్ కైనా పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి రామ.
ఉద్యమాలు, హామీలు, బిజెపి,