PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు రుణమాఫీ కాంగ్రెస్ తోనే సాధ్యం

1 min read

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్థర్ ను గెలిపించండి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నందికొట్కూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ. వెంకట్,పైపాలెం ఇనాయతుల్ల అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని కడుమూరు,49 బన్నూరు గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. నందికొట్కూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ పోటీ చేస్తున్నారని ఆయన సౌమ్యుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండి సేవ చేశారని రాష్ట్రంలోనే ఎమ్మెల్యేల కంటే అన్నింటిలోనూ ఎమ్మెల్యే ముందంజలో ఉన్నారని అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు, ఇండ్లు లేని వారికి 5 లక్షలు, విద్యార్థులకు కేజీ నుంచి పేజీ వరకు ఉచిత విద్య అందించడం,ఉపాధి హామీ పని పథకం రోజు కూలీ 400 రూ.లు,,వికలాంగులకు 6వేలు వృద్ధులకు వితంతువులకు 4వేలు పెన్షన్ ఇస్తామని ఇంటింటికి వెళ్లి వారు కరపత్రాలను పంచుతూ ప్రజలకు వివరించారు.హస్తం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా ఆర్థర్ని గెలిపించాలని వారు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో 49 బన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవుల జాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author