ఎన్నికల ముందు వాగ్దానాలకు ఎన్నిక తర్వాత తీసుకునే నిర్ణయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి
1 min readశ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కర్నూలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సిపి కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి మీటింగులో చంద్రబాబు నాయుడు రాబోయే ఐదు సంవత్సరాల వరకు కరెంట్ చార్జీలు పెంచము అని అధికారం లోకి వచ్చిన వెంటనే దాదాపు 6000 కోట్ల రూపాయలు జనం పై వేశారు అని ఇలా పెంచుకుంటూ పొతే రాబోయే ఐదు సంవత్సరాలలో ఏమి జరుగుతుందో ఊహించుకొని ప్రజలు భయానికి లోనవుతున్నారని తెలిపారు.ఇదే విదంగా ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల కు లోను అవుతున్నారు అని విమర్శలు చేసారు ఇదే సందర్భంలో కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులను కళాశాలకు రానివ్వడం లేదని తెలిపారు పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కే శ్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తానన్న సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజలపై యుజర్ ఛార్జి లు వేయ బోతున్నారు అని తెలిపారు సమావేశం లో అహమ్మద్ అలీఖాన్, సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.