PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోతిరెడ్డిపాడు నీళ్లు..రైతుల కళ్ళల్లో ఆనందం

1 min read

-రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలి:కలెక్టర్ -రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం:ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 5వ గేటు ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి,ఎమ్మెల్యే గిత్త జయసూర్య,బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి,పోతులపాడు గ్రామ సర్పంచ్ సుశీలమ్మ బటన్ నొక్కి నీళ్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న రైతులందరూ తాగు నీరు ద్వారా వారు పండించే పంటలు సస్యశ్యామలం కావాలని అదేవిధంగా పారు పండించే పంటలకు మంచి గిట్టుబాటు ధర ఉండాలని కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్యాములు నిండుతున్నాయని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్ఆర్బిసి కెనాల్ కు నీళ్లు వెళ్తున్నాయని నీళ్లు రావడం వల్ల రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.98 జీవో సమస్య ఉందని వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే కలెక్టర్ కు సూచించారు. రైతులకు సాగు తాగు నీటికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని 2014 టిడిపి ప్రభుత్వ హయాంలో ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చిన 19 నెలలోనే పూర్తి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎమ్మెల్యే అన్నారు.సాయంత్రం లోపు 10 వేల క్యూసెక్కులు నీళ్లు విడుదల అవుతాయని ఆయన అన్నారు.తర్వాత రైతులు ఎమ్మెల్యేను పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ దాసు, డిఎస్పీ శ్రీనివాసరావు,  ఇరిగేషన్ అధికారులు విష్ణువర్ధన్ రెడ్డి,మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, పోతులపాడు శివానందరెడ్డి, పలుచాని మహేశ్వర్ రెడ్డి,గిరీశ్వర్ రెడ్డి,జమీల్ తదితరులు పాల్గొన్నారు.

About Author