రైతుల పాలిట వరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
1 min readబీజేపీ చెన్నూర్ మండల అధ్యక్షులు గాడి భాస్కర్
రాష్ట్ర సీనియర్ నాయకుడు మాదినేని రామసుబ్బయ్య,
రైతులకు పెట్టుబడి సాయం పెంపుపై హర్షం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఎన్ డి ఏ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం క్రింద అందించే మొత్తం 6000నుండి 10000వరకు పెంచడం హర్షనీయమని భాజపా మండల అధ్యక్షులు గాడి భాస్కర్ . రాష్ట్ర సీనియర్ నాయకుడు మా ది నేని రామసుబ్బయ్యఅన్నారు . చెన్నూరు లో విలేకరులతో గురువారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఎలాంటి అవినీతి జరగకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతోందని చెప్పరు.కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. అలాగే పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పి ఎం ఎప్ బి వై ను మరింతగా మెరుగుపరచాలని నిర్ణయాయించడం జరిగిందని అన్నారు.ఈ పథకం రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్న కేంద్రం.. కేటాయింపులను రూ.69,515 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.అలాగే, 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రూ.1,350 చొప్పున రైతులకు అందజేసేందుకు రూ.3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.ప్రధాని నరేంద్ర మోదీ రైతు సంక్షేమమే ద్యేయం పని చేస్తూ 2025లో రైతులకు కానుక గా ఇవ్వనున్నారని తెలిపారు.