PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రణీత్ ప్రణవ్ ఆర్కేడియా ప్రారంభించిన ప్రణీత్ గ్రూప్

1 min read

దుండిగల్లో మల్టీఫేజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్

42 ఎకరాల ప్రాజెక్ట్లో విల్లాలు, అపార్ట్మెంట్లు

పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : హైదరాబాద్లో ప్రముఖ స్థిరాస్తి అభివృద్ధి సంస్థ ప్రణీత్ గ్రూప్, దుండిగల్లో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ” ప్రణీత్ ప్రణవ్ ఆర్కేడియా”కు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ప్రాజెక్ట్ను మూడు విడతల్లో అభివృద్ధి చేయనున్నారు, ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాంతాలు ఉంటాయి. దుండిగల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ప్రణీత్ గ్రూప్, తమ ప్రాజెక్ట్ల సమయానికే పూర్తి చేసే అపారమైన ట్రాక్ రికార్డుతో, ఇప్పుడు దుండిగల్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 సమీపంలో మరొక కొత్త కమ్యూనిటీని ప్రారంభించింది. 42 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతున్న ప్రణీత్ ప్రణవ్ ఆర్కేడియా మూడు విడతలుగా ఉంటుంది, ప్రతిదీ ప్రత్యేక లక్షణాలతో ఉంటుంది. 100 మరియు 120 అడుగుల వెడల్పైన రోడ్లతో అనుసంధానం కలిగిన ఈ ప్రాజెక్ట్కు ఓఆర్ఆర్కు సమీపంగా ఉన్నందున మెట్రో నగరంలోని ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు.మొదటి విడత: ప్రణీత్ ప్రణవ్ ఆర్కేడియా ప్రీమియం 21 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి  చేయబడే మొదటి విడతలో 250 పైగా లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాలు ఉంటాయి. ఈ విల్లాలు 167 నుంచి 350 గజాల విస్తీర్ణంలో 2,200 నుంచి 4,500 చదరపు అడుగుల నిర్మాణంతో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో ప్రారంభ ధర రూ.1.8 కోట్లు. ఈ విడతను 2028 జనవరిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.రెండవ విడత: ప్రణీత్ ప్రణవ్ ఆర్కేడియా గ్రాండ్ 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడే రెండవ విడతలో 99 పైగా లగ్జరీ డ్యుప్లెక్స్ విల్లాలు ఉంటాయి. వీటి పరిమాణం 167 నుంచి 214 గజాలు, నిర్మాణ విస్తీర్ణం 2,045 నుంచి 2,533 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో విల్లా ప్రారంభ ధర రూ.1.5 కోట్లు. ఈ విడత నిర్మాణం 2025 జూన్లో ప్రారంభమై, 2028 జనవరిలో పూర్తవుతుంది.మూడవ విడత: లగ్జరీ అపార్ట్మెంట్లు 13 ఎకరాల విస్తీర్ణంలో 1,500 పైగా లగ్జరీ అపార్ట్మెంట్లు నిర్మించబడతాయి. ఇవి 1,200 నుండి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి, 2బి హెచ్ కె, 2.5బి హెచ్ కె, మరియు 3 బి హెచ్ కెలుగా విభజించబడి ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ల రూ.72 లక్షల నుండి ప్రారంభమవుతుంది.ఈ సందర్భంగా ప్రణీత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరేంద్ర కుమార్ కామరాజు మాట్లాడుతూ, “ప్రత్యేకమైన డిజైన్తో, అందరికీ అందుబాటులో ఉండే, భవిష్యత్తు అవసరాలను తీరుస్తూ మన కస్టమర్లకు వసతులు కల్పించడం మా ప్రధాన లక్ష్యం. ప్రాజెక్ట్ను సమయానికి పూర్తి చేయడానికి మా బృందం కృషి చేస్తోంది” అని తెలిపారు.2024 సంవత్సరంలో, “మూడు ప్రాజెక్ట్లలో 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,081 యూనిట్లను మా కస్టమర్లకు అందించాం. 2025లో మరో 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,128 యూనిట్లను అందించబోతున్నాము. అదేవిధంగా, 2025లో 50 లక్షల చదరపు అడుగుల నిర్మాణంతో కొత్తగా మూడు ప్రాజెక్ట్లను ప్రారంభించబోతున్నాము” అని నరేంద్ర కుమార్ తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *