PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పద్మశాలి విద్యార్థులకు .. ప్రతిభా పురస్కారం..

1 min read

 టెన్త్​, ఇంటర్​లో అత్యుత్తమ మార్కులు సాధించిన 85 మందికి ప్రశంసాపత్రం, నగదు అందజేత

  • పద్మశాలీలు ఉన్నతంగా ఎదగాలి
  • ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు భీమనపల్లె వెంకట సుబ్బయ్య

నంద్యాల, పల్లెవెలుగు: పద్మశాలీ విద్యార్థులు చదువులో రాణించి… భవిష్యత్​లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు భీమనపల్లె వెంకట సుబ్బయ్య. నంద్యాల సంజీవ్​ నగర్​లోని భద్రావతి, భావన రుశి  కళ్యాణ మండపంలో కర్నూలు ఉమ్మడి పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం  పది, ఇంటర్​లో అత్యుత్తమ మార్కులు సాధించిన 85 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించారు. మొదటి బహుమతి కింద  రూ.10వేలు, రెండవ బహుమతి కింద  రూ.7500, మూడవ బహుమతి కింద రూ.5వేలు,  కన్సోలేషన్ బహుమతి కింద ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు, మరియు ప్రశంసా పత్రములు మెమెంటోలు అందజేశారు.

 విద్యార్థుల ప్రతిభకు.. పట్టాభిషేకం…: భీమనపల్లె వెంకటసుబ్బయ్య

ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షులు భీమనపల్లె వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పద్మశాలీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏడాది కూడా ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దాతలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.  రాబోయే సంవత్సరాలలో ఇంతకంటే మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.  

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి:వద్ది నరసింహులు

అనంతరం అఖిలభారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. పద్మశాలీలు ఆర్థికంగా.. సామాజికంగా.. రాజకీయంగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి పద్మశాలీ కుటుంబ సభ్యులు తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలని, అప్పుడే విద్యార్థులకు మంచి భవిష్యత్​ ఇచ్చిన వారమవుతామన్నారు.

లక్ష్యం దిశగా…పయనించండి…: కొంకతి లక్ష్మీనారాయణ

ఆ తరువాత రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు. గురువులు, పెద్దలు, తల్లిదండ్రులను గౌరవించడం  విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామన్నారు.

పద్మశాలీలుగా.. గర్వపడదాం…: గాజుల శంకర్ 

ప్రధాన కార్యదర్శి గాజుల శంకర్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పద్మశాలీలుగా సగర్వంగా చెప్పుకోవాలని సూచించారు. పద్మశాలీ విద్యార్థులు ఐక్యంగా ఉండాలని హితవు పలికారు.  ఈ  కార్యక్రమంలో పెద్దలు చెన్నా వెంకటేశ్వర్లు,  పుత్త రామకృష్ణ , సోమా బ్రహ్మానందం,  జి. వెంకట రామయ్య, భీమనపల్లె పురంధర్, జేరపు చంద్రశేఖర్, కట్టా రామకృష్ణ , కోటా బాల వెంకటసుబ్బయ్య, కోడి పరమేశ్వరులు, శిరసాల రామచంద్రుడు, సింగరి  సురేష్ బాబు, కూడా సుబ్రహ్మణ్యం, ఎర్రం శ్రీనివాసులు  మరియు కుల బంధువులు 400 పైన కుల బాంధవులు పాల్గొన్నారు.

About Author