వరుణదేవుడు కరుణించాలని ప్రార్థనలు : ఎమ్మెల్యే
1 min readవరుణదేవుడు కరుణించి ఆదోని ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురవాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు.
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఎమ్మెల్యే స్వగృహం లో హిందూ, ముస్లిం, క్రైస్తవ మత గురువులతో కలసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని లో వర్షం పడాలని ఎమ్మెల్యే 15 రోజుల పాటు దీక్ష తీసుకుతున్నట్లు వెల్లడించారు వర్షాలు పడాలని ఆదోని లోని అన్ని దేవాలయాల్లో , అన్ని మసీదుల్లో, అన్ని చర్చిల్లో తమ తమ మత గురువులు ప్రత్యేక పూజలు ప్రార్థనలు చెయ్యాలని పిలుపునిచ్చారు. ఆదోని ప్రాంతంలో సకాలంలో వర్షాలు రాకపోతే ఆదోని ప్రాంతంలోని రైతుల పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా తయారవుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మనకు భగవంతుడు కరుణిస్తేనే మనకు సరైన వర్షం వచ్చి మన ప్రాంతం లోని ప్రజలు, రైతుల కుటుంబాలు, వ్యాపారస్తుల కుటుంబాలు సుఖశాంతులతో ఉంటారని అన్నారు. ఏదేమైనాప్పటికీ మేము ఈరోజు ఆ భగవంతున్ని ప్రార్ధన చేయడం కారణంగా కచ్చితంగా వరుణ దేవుడు కరుణించి మంచి వర్షాన్ని ఇస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ మత గురువులు M.J దత్తాత్రేయ శర్మ,K.M జగదీశ్వర,HM పంచాక్షరయ్య,పత్రి శివ శంకర్, ముస్లిం మత గురువులు హాజీ హతీఫ్, ఖతీఫ్,పాస్టర్లు G.ఆనంద రాజ్,B.ఎజ్రా శ్రీధర్తదితరులు పాల్గొన్నారు.