ఘనంగా ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ బి. తిమ్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, హరిదాసు కీర్తనల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారిని బహుమతులతో అభినందించారు. విద్యా సంస్థల డైరెక్టర్ డా. హరికిషన్, ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలకు చిన్నతనం నుంచి పరిచయం చేయాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పిల్లలలో మానసిక పరిణతి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.