విజయవంతంగా ముగిసిన హోళగుంద ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్…
1 min readవిజేతగా నిలిచిన విరాట్ 11 టీం….
పల్లెవెలుగు వెబ్ హోళగుంద: సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన హోళగుంద ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ నందు మొత్తం ఆరు టీములు పాల్గొనగా విరాట్ 11 టీం విజేతగా నిలిచింది.రెండవ విజేతగా ఓ జి 11 టీం నిలిచింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేయుటకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుయువత కార్యదర్శి వాల్మీకి సురేంద్ర, సుధాకర్, ఎస్ఎంసి చైర్మన్ ద్వారకానాథ్,టిడిపి సీనియర్ నాయకులు కాకి సీతయ్య, యువ నాయకుడు తిక్క స్వామి, మైనార్టీ నాయకుడు ముల్లా మోయిన్, జనసేన కన్వీనర్ అశోక్, కో- కన్వీనర్ వరాల వీరేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత జిల్లా కార్యదర్శి వాల్మీకి సురేంద్ర మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యువకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా గౌడ్ ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి 10000 రూపాయలు, రెండవ బహుమతి 5000 రూపాయలు అందించడం జరిగిందని,భవిష్యత్తులో క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.గత మూడు రోజులుగా జరిగిన క్రికెట్ పోటీల్లో నేడు ఫైనల్ ఓ జి 11 వర్సెస్ విరాట్ 11 టీములు పోటీ పడగా మొదటిగా బ్యాటింగ్ చేసిన ఓ జి 11 10 ఓవర్లకు గాను 106 పరుగులు చేసింది. రెండవ బ్యాటింగ్కు దిగిన విరాట్ 11 6 ఓవర్లు 1 బంతులలో 112 పరుగులు చేసి విజేతగా నిలిచిందని అన్నారు. ఈ మ్యాచ్లో క్రీడాకారుడు మనోజ్ 23 బంతులలో 75 పరుగులు సాధించి,4 ఫోర్లు, 9 సిక్సులు మెరుపు ఆట కనబరచడంతో కేవలం 3 ఓవర్లు 5 బంతులు మిగిల్చి ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజర్లు వారిస్,శీను, శాలి అమన్, సిద్దు, గౌస్, దేవరాజు,మల్లికార్జున, రౌఫ్,అబ్రార్ మాట్లాడుతూ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన గ్రామ ప్రజల గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, తోటి క్రీడాకారులకు,హెచ్ఎం నజీర్ అహ్మద్,ఎస్సై బాల నరసింహులు,మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ్,టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.