మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో ఫిబ్రవరి మాసంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మహానంది దేవస్థాన కార్యాలయంలో మీడియాతో సమావేశాన్ని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. భక్తులకు త్రాగునీటితోపాటు మజ్జిగ బాదంపాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులు వికలాంగులు తదితరుల దర్శన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యూలైన్లు, ప్రసాదాలు టికెట్ల కొరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్షేత్రంలో విద్యుత్ అలంకరణతో పాటు వాహనాల పార్కింగ్ వద్ద విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా స్వామి అమ్మ వాళ్ళ దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 22వ తేదీన మహానందిశ్వర స్వామి ఉత్సవము మూర్తులు నంద్యాలకు బయలుదేరుతాయని తిరిగి అక్కడినుండి 23వ తేదీ బ్రహ్మ నందీశ్వర స్వామి ఉత్సవ మూర్తులతో సహా మహానంది క్షేత్రానికి చేరుకుంటాయన్నారు. 24 ధోజారోహణంతో బ్రహ్మోత్సవాలు మహానంది క్షేత్రంలో ప్రారంభం అవుతాయని తెలిపారు. 26వ తేదీ లింగోద్భవం, 27 తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది అన్నారు 28 రథోత్సవం మార్చి 1న పూర్ణాహుతితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ మధు, వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆలయ ప్రధాన అర్చకులు అర్జున్ శర్మ ఆలయ సూపరిండెంట్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.